Skip to main content

AP Exams: ఏపీ ఐసెట్ షెడ్యూల్ వ‌చ్చేసింది... పూర్తి వివ‌రాలు ఇవే

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌లైంది. నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ICET

మే 24, 25వ తేదీల్లో ప‌రీక్ష...
మార్చి 17వ తేదీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంది. మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.గ‌డువు ముగిసిన తర్వాత రూ.1000 అప‌రాధ రుసుంతో ఏప్రిల్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ.2 వేల ఫైన్‌తో ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వ‌ర‌కు... రూ.3వేల ఫైన్‌తో మే 4 నుంచి 10వ తేదీ వ‌ర‌కు, రూ.5వేల ఫైన్‌తో మే 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మే 16, 17వ తేదీల్లో ద‌ర‌ఖాస్తుల్లో ఏమైన త‌ప్పులుంటే స‌ర‌వించుకోవ‌చ్చు. మే 20వ తేదీ నుంచి హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 24, 25వ తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

చ‌ద‌వండి: ఏపీలో ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

చ‌ద‌వండి: మే 15న ఈఏపీసెట్‌.. ఈసారి వెయిటేజీ ఎంతంటే

Published date : 21 Apr 2023 03:20PM

Photo Stories