JEE Main 2024 Notification: జేఈఈ(మెయిన్స్)-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్ రాయాలి. అందుకు జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం లభిస్తుంది.
అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన లేదు. 2022, 2023లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ(మెయిన్)-2024కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం, మిగతా అభ్యర్థులకు 75 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్‌టీఏ స్పష్టంచేసింది.
చదవండి: JEE Main Guidance
ముఖ్యమైన తేదీలు
- సెషన్-1: జేఈఈ(మెయిన్)-జనవరి 2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023
- పరీక్ష తేదీలు: 2024 జనవరి నుంచి ఫిబ్రవరి 1 వరకు.
- సెషన్-2: జేఈఈ(మెయిన్)-ఏప్రిల్ 2024
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 02.02.2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.03.2024
- పరీక్ష తేదీలు: 2024 ఏప్రిల్ 1 నుంచి 14 వరకు
- వెబ్‌సైట్: https://jeemain.nta.ac.in
Last Date