Admissions: డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
కళాశాలలు: కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(వెంకటరామన్నగూడెం), కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్(అనంతరాజుపేట).
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్.
కోర్సుల వివరాలు
ఎంఎస్సీ(హార్టికల్చర్): రెండేళ్లు/నాలుగు సెమిస్టర్లు; సీట్ల సంఖ్య: 48.
పీహెచ్‌డీ(హార్టికల్చర్): మూడేళ్లు/ఆరు సెమిస్టర్లు; సీట్ల సంఖ్య: 21
అర్హత: పీజీ కోర్సులకు బీఎస్సీ(హార్టికల్చర్), బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్సీ(హార్టికల్చర్), ఎంఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పీజీ కోర్సులకు ఐకార్ ఏఐఈఈఏ(పీజీ)–2023 ర్యాంకు, పీహెచ్‌డీ కోర్సులకు ఐకార్ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్(పీహెచ్‌డీ)–2023 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్శిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.11.2023.
కౌన్సెలింగ్ తేదీలు: పీజీ కోర్సులకు 07.12.2023, పీహెచ్‌డీ కోర్సులకు 08.12.2023.
వెబ్‌సైట్: https://drysrhu.ap.gov.in/
చదవండి: BTech Admissions: ఓయూ–యూసీఈ, హైదరాబాద్‌లో బీఈ/బీటెక్ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..