Skip to main content

CUET PG 2024 Notification: కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ పరీక్ష

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు పలు ఇతర యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పీజీలో ప్రవేశాలు లభిస్తాయి.
National Testing Agency CUET PG Notification Educational Institutions Admission Test CUET PG 2024 Application and Admissions  CUET PG 2024 Admissions Process CUET PG Entrance Exam 2024  CUET PG 2024 Notification   National Testing Agency   Admission in PG for Central Universities

కోర్సుల వివరాలు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎఫ్‌ఏ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్, ఎంఎడ్, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంకాం తదితరాలు.

అర్హత: డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మరికొన్ని కోర్సులకు డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి.
వయసు: అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.

ఆన్‌లైన్‌ పరీక్ష: పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట 45 నిమిషాలు. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో(లాంగ్వేజ్, ఎంటెక్‌ హయ్యర్‌ సైన్సెస్, ఆచార్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో 75 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.01.2024
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 25.01.2024.
దరఖాస్తు సవరణ: 27.01.2024 నుంచి 29.01.2024 వరకు
పరీక్ష కేంద్రం సమాచారం వెల్లడి: 04.03.2024
అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ ప్రారంభం: 07.03.2024.
పరీక్ష తేదీలు: 11.03.2024 నుంచి 28.03.2024 వరకు
వెబ్‌సైట్‌: https://pgcuet.samarth.ac.in/

చదవండి: PhD Admission in IIM Tiruchirappalli: ఐఐఎం తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. చివ‌రి తేదీ ఇదే..
 

Last Date

Photo Stories