Skip to main content

NIFT Delhi Admissions 2024: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌).. దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్‌ సెషన్‌ 2024–25కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎన్‌టీఏ పరీక్ష నిర్వహిస్తోంది.
NIFT Delhi Admissions 2024   NIFT Admission 2024-25  National Testing Agency

నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జో«ద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్‌.

కోర్సుల వివరాలు
బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి; బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌ (బీడీఈఎస్‌): ఫ్యాషన్‌ డిజైన్‌/లెదర్‌ డిజైన్‌/యాక్సెసరీ డిజైన్‌/టెక్స్‌టైల్‌ డిజైన్‌/నిట్‌వేర్‌ డిజైన్‌/ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌) ప్రోగ్రామ్‌.
మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి; మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌(ఎండీఈఎస్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎంఎఫ్‌ఎం),మా స్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(ఎంఎఫ్‌టెక్‌). 
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ).
అర్హత: యూజీ ప్రోగ్రామ్‌కు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: యూజీకి 24 ఏళ్లు మించకూడు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు
యూజీ, పీజీ ప్రోగ్రామ్‌:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 03.01.2024.
దరఖాస్తు సవరణతేదీలు: 10.01.2024 నుంచి 12.01.2024 వరకు
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: జనవరి మూడో వారం, 2024.
డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 05.02.2024.

వెబ్‌సైట్‌: https://www.nift.ac.in/

చ‌ద‌వండి: Admissions: ఆంధ్ర యూనివర్శిటీ విశాఖపట్నంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories