UG Admissions 2023: అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో యూజీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
నాలుగేళ్ల బీఏ ఆనర్స్: ఎకనామిక్స్/ఇంగ్లిష్/హిస్టరీ/ఫిలాసఫీ/సోషల్ సైన్స్.
నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్: బయాలజీ/కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ/మ్యాథమేటిక్స్/ఫిజిక్స్.
నాలుగేళ్ల బీఎస్సీ బీఈడీ డ్యూయల్ డిగ్రీ: బయాలజీ /కెమిస్ట్రీ/ మ్యాథమేటిక్స్ /
ఫిజిక్స్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/12వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21 ఏళ్లు మించకూడదు.
ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.11.2023.
ప్రవేశ పరీక్ష తేది: 24.12.2023.
ఇంటర్వ్యూ తేది: జనవరి 2024.
వెబ్‌సైట్: https://azimpremjiuniversity.edu.in/
Last Date