Admission in YSRUHS: డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీలో బీఎన్‌వైఎస్ ప్రవేశాలు
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎన్‌వైఎస్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 100
సీట్ల వివరాలు: కేర్ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ(బాపట్ల)-50 సీట్లు. పతంజలి మహర్షి నేచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్, గుంతకల్-50 సీట్లు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఫిజిక్స్,కెమిస్ట్రీ,బయాలజీ)ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థి 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.10.2023
వెబ్‌సైట్: https://ugbnys.ysruhs.com/
Last Date