Admissions in KNRUHS: కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సుల వివరాలు
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు(బీపీటీ).
బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ).
బీఎస్సీ(అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులు: బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ.
కోర్సు వ్యవధి: బీఎస్సీ కోర్సుకు నాలుగేళ్లు, ఏడాది ఇంటర్న్‌షిప్; బీపీటీకి నాలుగేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/సార్వత్రిక విద్యలో ఇంటర్(ఫిజికల్ సైన్సెస్/బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థులు 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.11.2023.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/