CSIR-UGC NET Notification: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్-2023కు నోటిఫికేషన్ విడుదల..
సబ్జెక్టులు: పరీక్షను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్ ఎంఎస్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2023 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
చదవండి: PhD Admissions: ఎన్‌జీ రంగా యూనివర్శిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ప్రవేశ విధానం ఇలా..
పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 02.12.2023 నుంచి 04.12.2023 వరకు.
పరీక్ష తేదీలు: 26.12.2023, 27.12.2023, 28,12.2023.
వెబ్‌సైట్: https://csirnet.nta.nic.in/, https://www.nta.ac.in/