NVS 9th Class Admissions 2024: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా..
అర్హత: విద్యార్థి జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లా నివాసి అయి ఉండాలి. 2023–24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి.
వయసు: 01.05.2009 నుంచి 31.07.2011 మధ్య జన్మించి ఉండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథమేటిక్స్) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది.
చదవండి: Formative Assessment-2: పాఠశాల విద్యార్థులకు ఎఫ్ఏ-2 పరీక్షలు మొదలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. దీనితోపాటు అభ్యర్థి ఫోటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023
ప్రవేశ పరీక్ష తేది: 10.02.2024.
వెబ్‌సైట్: https://navodaya.gov.in/