Formative Assessment-2: పాఠశాల విద్యార్థులకు ఎఫ్ఏ-2 పరీక్షలు మొదలు
సాక్షి ఎడ్యుకేషన్: ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–2 పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని 1–10 తరగతుల విద్యార్థులకు మంగళవారం నుంచి 6వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 1–10 తరగతుల విద్యార్థులు 3,81,399 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. 1–5 తరగతులు, 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి.
Holidays : అక్టోబర్ 25వ తేదీ వరకు దసరా సెలవులు.. అలాగే నెల చివరిలో కూడా..
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పాఠశాలల్లోనూ పూర్తయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఎఫ్‌ఏ–2 పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1–5 తరగతుల విద్యార్థులకు ఆయా యాజమాన్యాలే ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటున్నాయి. తక్కిన 6-10 తరగతులకు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
ఎస్‌ఏ–1 పరీక్షలు తేదీలు ఇవే
గంట ముందు ఎంఈఓ మొబైళ్లకు ప్రశ్నపత్రాలు
డీఈఓ ఆదేశాల మేరకు డీసీఈబీ నుంచి ఉదయం, మధ్యాహ్నం గంట ముందు మండల విద్యాశాఖ అధికారుల మొబైళ్లకు ప్రశ్నపత్రాలు పంపుతారు. ఎంఈఓలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపుతారు. వారు స్కూళ్లలో టీచర్లకు పంపుతారు. పరీక్షల నిర్వహణ విధుల్లో ఉండే టీచర్లు తరగతి గదిలో బోర్డుపై ప్రశ్నపత్రాలు రాస్తారు. వాటి ఆధారంగా విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. సౌలభ్యం ఉంటే ప్రింట్ తీసుకుని విద్యార్థులకు అందజేస్తారు.
Courses for Students: భవిష్యత్ లో విద్యార్థుల జీవితానికి, ఉద్యోగానికి వివిధ కోర్సుల భరోసా
అన్ని స్కూళ్లలోనూ షెడ్యూలు ప్రకారమే పరీక్షలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగే పాఠశాలల్లో తర్వాత రోజు ఎఫ్‌ఏ–2 పరీక్షలు నిర్వహించాలంటూ చేస్తున్న ప్రచారాలను విద్యాశాఖ అధికారులు ఖండించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతున్నా...మరోవైపు విద్యార్థులకు పరీక్షలు జరగుతాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ అయ్యాయి.