Skip to main content

ఎస్‌ఏ–1 పరీక్షలు తేదీలు ఇవే

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో ఆక్టోబ‌ర్‌ 5వ తేదీ నుంచి 1వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1(సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి ఎం.వెంకటేశ్వరాచారి సెప్టెంబ‌ర్ 29న ఒక ప్రకటనలో తెలిపారు.
SA 1 exam dates
ఎస్‌ఏ–1 పరీక్షలు తేదీలు ఇవే

1నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 12.45 గంటల వరకు, 9, 10 విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. అక్టోబర్‌ 11వ తేదీ వరకు జరుగుతాయని, ప్రధానోపాధ్యాయులు ఎంఆర్‌సీల నుంచి అక్టోబర్‌ 4వ తేదీలోగా ప్రశ్నాపత్రాలు పొందాలని సూచించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 30 Sep 2023 02:02PM

Photo Stories