Skip to main content

10th & Inter Exams: అక్టోబర్‌ 3 నుంచి 'ఓపెన్‌' టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

10th & Inter Exams
10th & Inter Exams

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అక్టోబర్‌ 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు థియరీ పరీక్షలు, 16 నుంచి 23వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

PG Courses Admissions: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

పదో తరగతిలో 596 మంది విద్యార్థులు, ఇంటర్‌లో 631 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహసీల్దార్లు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Tenth Class: ఈ తేదీ లోగా టెన్త్‌ ప్రీ ఫైనల్స్‌ నిర్వహించాలి.. సిలబస్ మాత్రం  ఇలా.. | Sakshi Education

AP TET 2024 Exams: అక్టోబర్‌ 3 నుంచి టెట్‌ పరీక్షలు.. ఆ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా..

పరీక్షలు రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు జరుగనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటేశ్వరరావు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 12:13PM

Photo Stories