Holidays : అక్టోబర్ 25వ తేదీ వరకు దసరా సెలవులు.. అలాగే నెల చివరిలో కూడా..
అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26వ తేదీన (గురువారం) పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్రకటించారు. అలాగే ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు తమ క్యాలెండర్‌లో సెలవులను పొందుపరిచారు. ఈ అక్టోబర్ నెల సెలవుల నామసంవత్సరంలా ఉంది. ఉద్యోగులకు.., విద్యార్థులకు.. ఇక పండగే.. పండగ.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం..
అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏపీలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పద్ధతిలోనే పరీక్షలు..
ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఈ సారి భారీగా తగ్గిన సెలవులు..
క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.
అక్టోబర్ నెలలో సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ అక్టోబర్ 1: ఆదివారం
☛ అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
☛ అక్టోబర్ 8: ఆదివారం
☛ అక్టోబర్ 14: రెండవ శనివారం
☛ అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 15: ఆదివారం
☛ అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
☛ అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
☛ అక్టోబర్ 22: ఆదివారం
☛ అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
☛ అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
☛ అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
☛ అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 28: నాల్గవ శనివారం
☛ అక్టోబర్ 29: ఆదివారం
☛ అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)
Tags
- schools and colleges holidays october 2023
- College Holidays
- Schools Holidays News
- dasara schools and colleges holidays 2023 telugu news
- dasara school holidays 2023
- dasara colleges holidays 2023
- dasara school holidays 2023 telangana
- dasara school holidays 2023 andhra pradesh
- dussehra holidays in telangana 2023
- Dasara holidays 2023
- ap dasara holidays 2023 telugu news
- ts dasara holidays 2023 telugu news