Skip to main content

Today Schools Holiday Due to Heavy Rain 2024 : అత్యంత భారీ వర్షాలు.. స్కూల్స్‌కు సెల‌వు.. విద్యాశాఖ ప్ర‌క‌ట‌న‌

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారీ నుంచి అతి వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో.. స్కూల్స్ వెళ్లాలంటే.. విద్యార్థులు చాలా ఇబ్బంది ప‌డుతున్నారు.
Hyderabad school holiday due to heavy rains  Heavy Rain  Parents demand school holiday in Hyderabad and Rangareddy district  School closed due to heavy rains in Hyderabad

అలాగే హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. ఆగ‌స్టు 20వ తేదీ మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. 

అన్ని ప్రాంతాల్లో వ‌ర‌ద నీటీతో..
అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరింది. 

లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో.. 
దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ముషీరాబాద్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాంనగర్‌, పార్సీగుట్ట, బౌద్ధ నగర్‌, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్నిచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

హైద‌రాబాద్‌, రంగారెడ్డిలోని చాలా స్కూల్స్‌కు సెల‌వు..
అయితే ఇప్ప‌టికే చాలా స్కూల్స్ య‌జ‌మాన్యాలు స్కూల్స్ సెల‌వు ఇచ్చారు. ఈ మేర‌కు స్కూల్స్ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు మెసేజులు పంపుతున్నారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని చాలా స్కూల్స్‌కు ఈ రోజు సెల‌వు ఇచ్చారు. ఇంకా చాలా స్కూల్స్‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో స్కూల్స్‌కు వ‌రుస‌గా సెల‌వులు వ‌స్తున్నాయి.

స్కూల్స్‌కు సెల‌వు ఇవ్వాల్సిందే..?
హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తున్న నేప‌థ్యంలో.. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాలంటే.. చాలా సమ‌స్యలు ఎదుర్కొంటున్నారు. ప‌లువురి విద్యార్థుల త‌ల్లిదండ్రులు స్కూల్స్ సెల‌వు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైన ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్యులు అంటున్నారు. అలాగే విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొర్లడంతో పాటు పలు కాలనీలు, రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో ఈ వేకువ జాము నుంచి ఉరుములు, పిడుగులతో కుండపోత కురుస్తోంది. 

రేపు కూడా కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం..?
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా స్కూళ్లకు సెలవు ప్రకటించిన విష‌యం తెల్సిందే. హైదరాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారిక సమాచారం. పలు జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలువురు విద్యార్థులు ఇప్పటికే స్కూళ్లకు చేరిన విషయం తెలిసిందే. ఆలస్యంగా స్కూళ్లకు సెలవు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. అలాగే ఈ వాన‌లు ఇలాగే కురుస్తుంటే.. రేపు కూడా స్కూల్స్ సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 

సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం.. మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధప్రతిపాదికన చర్యల్లో పాల్గొంటున్నాయి.

అత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.

వర్ష బీభత్సం.. హైలెట్స్‌

  • నీట మునిగిన బస్తీలు, కాలనీలు

  • కొట్టుకుపోయిన కార్లు, బైకులు

  • రామ్‌, బౌద్ధ నగర్‌, గంగపుత్ర కాలనీల్లో నడుం అంచు వరకు నీరు

  • ప్రమాదం అంచుల్లో పార్సిగుట్టలోని పలు పప్రాంతాలు

  • జంట నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు.. పంజాగుట్ట, లక్డీకాపూల్‌లో మోకాల లోతు దాకా నీరు

  • హైటెక్‌ సిటీ దగ్గర చెరువును తలపిస్తున్న రోడ్లు

  • రాకపోకలకు అవాంతంర.. వాహనదారులకు ఇబ్బందులు

  • చాలా చోట్ల 10 సెం.మీ. లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది

  • యూసఫ్‌గూఢలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షం పడింది.

Published date : 20 Aug 2024 08:53AM

Photo Stories