Skip to main content

Tomorrow Schools Holiday Due to Heavy Rain 2024 : విద్యాసంస్థ‌ల‌కు సెల‌వుపై మంత్రి కీలక‌ ఆదేశాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ నుంచి అతి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. ఈ భారీ వ‌ర్షంలో స్కూల్స్ విద్యార్థుల స్కూల్స్‌కి వెళ్లాలంటే..చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Telangana Minister Ponguleti Srinivas Reddy  heavy rains in Telangana Telangana minister horse video conference school holiday announcements Telangana weather updates

ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భారీ వ‌ర్షాల‌పై జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ భారీ వ‌ర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. 

అలాగే జ‌న‌జీవ‌నానికి ఆటంకాలు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించే నిర్ణయాన్ని క‌లెక్ట‌ర్లే తీసుకోవాల‌ని ఆదేశించారు. ఒక వేళ ఇలాగే భారీ వర్షం కురిస్తే.. రేపు కూడా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇవాళ హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూల్స్‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

☛➤ August 25, 26th Holidays 2024 : ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు.. ఎందుకంటే..?

ఎల్లో అలర్ట్‌ జారీ..
మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

విద్యార్థుల‌ త‌ల్లిదండ్రులు సెల‌వు ఇవ్వాల‌ని..
హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తున్న నేప‌థ్యంలో.. విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాలంటే.. చాలా సమ‌స్యలు ఎదుర్కొంటున్నారు. ప‌లువురి విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఇలాగే వ‌ర్షం కురిస్తే.. రేపు కూడా స్కూల్స్ సెల‌వు ముందే ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైన ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్యులు అంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొర్లడంతో పాటు పలు కాలనీలు, రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో ఈ వేకువ జాము నుంచి ఉరుములు, పిడుగులతో కుండపోత కురుస్తోంది. 

ఈ రోజు ఆలస్యంగా స్కూళ్లకు సెలవు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ వాన‌లు ఇలాగే కురుస్తుంటే.. రేపు కూడా స్కూల్స్ సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

Published date : 20 Aug 2024 05:55PM

Photo Stories