Skip to main content

AFCAT: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌–01/2024).. కోర్సు జనవరి 2025లో ప్రారంభం

ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌–01/2024)కు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ కోర్సు జనవరి 2025లో ప్రారంభం కానుంది.
Airforce Recruitment 2024-2025, afcat 2024 notification , Apply for AF CAT 01/2024, AF CAT Entrance Test 2024-2025,

కోర్సు వివరాలు: ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌)01/2024, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌
ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ: ఫ్లయింగ్‌/గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)/గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌–టెక్నికల్‌)
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఫ్లయింగ్‌.
అర్హత: ఇంటర్‌(ఫిజిక్స్, మ్యాథ్స్‌), సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు 20 నుంచి 24 ఏళ్లు.గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌/నాన్‌–టెక్నికల్‌) బ్రాంచ్‌కు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: ఫ్లయింగ్‌ ఆఫీసర్‌కు రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌–1, స్టేజ్‌–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు పారంభతేది: 01.12.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2023.

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/

చ‌ద‌వండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Date

Photo Stories