సత్వర ఉపాధికి బెస్ట్ ఛాయిస్.. పాలిటెక్నిక్ డిప్లొమా

2025 ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంలో పాలిసెట్ పరీక్ష విధానం, కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు వంటి ముఖ్య సమాచారం తెలుసుకోవడం అవసరం.
ఏపీలో 279 పాలిటెక్నిక్స్ - 88 ప్రభుత్వ + 191 ప్రైవేట్
ఏపీ పాలిసెట్ ద్వారా 88 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 191 ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో 30 బ్రాంచ్‌లలో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- ప్రభుత్వ పాలిటెక్నిక్స్ - 18,141 సీట్లు
- ప్రైవేట్ పాలిటెక్నిక్స్ - దాదాపు 70,000 సీట్లు
అర్హతలు
- పదో తరగతి ఉత్తీర్ణత కావాలి.
- 2025లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలిసెట్ పరీక్ష విధానం
- పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.
- పరీక్ష వ్యవధి - 2 గంటలు
- మొత్తం మార్కులు - 120
- మ్యాథమెటిక్స్ – 50 ప్రశ్నలు (50 మార్కులు)
- ఫిజిక్స్ – 40 ప్రశ్నలు (40 మార్కులు)
- కెమిస్ట్రీ – 30 ప్రశ్నలు (30 మార్కులు)
డిప్లొమా కోర్సులు - విభాగాలు
పాలిటెక్నిక్స్‌లో వివిధ విభాగాల్లో టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన కోర్సులు:
- సివిల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్
- క్లౌడ్ కంప్యూటింగ్ & బిగ్ డేటా
- 3D యానిమేషన్ & గ్రాఫిక్స్
- కెమికల్ ఇంజనీరింగ్
- టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
- బయోమెడికల్ ఇంజనీరింగ్
- మైనింగ్ ఇంజనీరింగ్
- ప్రింటింగ్ టెక్నాలజీ
- అపెరల్ డిజైన్ & ఫ్యాషన్ టెక్నాలజీ
స్కాలర్‌షిప్ సదుపాయాలు
- ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE) – ప్రతి సంవత్సరం రూ. 50,000 వరకు 5,000 మంది అమ్మాయిలకు.
- సాక్షమ్ స్కాలర్‌షిప్ – దివ్యాంగ విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్‌షిప్.
- ఫీజు రీయింబర్స్‌మెంట్ – అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది.
ఉజ్వల ఉద్యోగ అవకాశాలు
- సూపర్వైజర్ స్థాయిలో ఉద్యోగాలు – డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమల్లో సూపర్వైజర్‌గా చేరొచ్చు. నెలకు రూ. 20,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది.
- AE, AEE పోస్టులు – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా AE (Assistant Engineer), AEE (Assistant Executive Engineer) పోస్టులకు అర్హత లభిస్తుంది.
- లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ – ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో నేరుగా అడుగు పెట్టే అవకాశం.
ఎంట్రెన్స్‌లో రాణించాలంటే..
మ్యాథమెటిక్స్
సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, త్రికోణమితి, క్షేత్రమితి, గ్రాఫ్ ఆధారిత సమస్యలను చక్కగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రతి చాప్టర్ చివరిలో ఇచ్చిన ప్రాక్టీస్ సమస్యలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి.
ఫిజిక్స్
- కాంతి పరావర్తనం, వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.
- ప్రాజెక్ట్‌లు, పటాలు, ప్రయోగాల ద్వారా అవగాహన పెంచుకోవాలి.
కెమిస్ట్రీ
ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, కెమికల్ బాండింగ్‌పై పట్టు సాధించాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 2025 ఫిబ్రవరి 1
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 15
పాలిసెట్ పరీక్ష తేదీ: 2025 ఏప్రిల్ 30 (ఉదయం 11:00 - మధ్యాహ్నం 1:00)
ఫలితాల వెల్లడి: 2025 మే 10
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://polycetap.nic.in/BROCHURE.pdf
![]() ![]() |
![]() ![]() |
Tags
- Polytechnic Diploma Courses Details
- AP POLYCET 2025 Notification
- Polytechnic Diploma Admission Process
- POLYCET 2025 Application Procedure
- Engineering Courses After 10th
- POLYCET Exam Details and Syllabus
- Career Opportunities After Polytechnic Diploma
- AP POLYCET 2025 Results
- Direct Admission to B.Tech Through Diploma
- Polytechnic Counselling Process and Seat Allotment