Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా..
అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగో తరగతి 2023–24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.1,50,000, పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు.
ప్రవేశ పరీక్ష: ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), మ్యాథ్స్(25 మార్కులు), మెంటల్ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.12.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.01.2024.
ప్రవేశ పరీక్ష తేది: 11.02.2024.
వెబ్‌సైట్: http://tswreis.ac.in/ or https://tgcet.cgg.gov.in/
Tags
- ts gurukulam
- admission in 5th Class
- TS Gurukulam 5th Class Admission 2023-24
- admissions
- Govt Gurukul Schools
- TSWREIS
- TSWREIS Admissions
- TTWREIL
- MJPTBBCWREIS
- TGCET
- Telangana
- GurukulAdmissions
- TSWREIS
- TTWREIL
- MJPTBCWREIS
- TREIS
- AcademicYear2024-25
- ClassV
- EnglishMedium
- AdmissionApplications
- TelanganaEducation
- Sakshi Education Latest News