Skip to main content

TS LAWCET 2022: టీఎస్‌ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలా..

TS Lawcet 2022 Notification

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ విశ్వవిద్యాలయాలు/వాటి అనుబంధ కళాశాలల్లో.. లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్‌ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది. దీనిద్వారా తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు

  • మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. వీరు బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ చేసే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ

  • తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ లాసెట్‌) పరీక్ష ద్వారా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో మొత్తం 120 మార్కులకు గాను 120 ప్రశ్నలకు ఉంటుంది. 3 పార్ట్‌లుగా పరీక్షను నిర్వహిస్తారు. అవి..
  • కరెంట్‌ ఆఫైర్స్‌: ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులుంటాయి.
  • అప్టిట్యూడ్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ లా: ఈ విభాగం నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
  • మూడు విభాగాలకు కలిపి పరీక్ష సమయం 90 నిమిషాలు. ఎటువంటి నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పరీక్షను రాసుకోవచ్చు.

కోర్సు అనంతరం 
లా కోర్సు పూర్తిచేసిన తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టాలంటే..‘ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌’లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోవాలి. 

కెరీర్‌
న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. లా పూర్తిచేసిన తర్వాత లీగల్‌ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్‌ మేనేజర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి హోదాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

  • లా డిగ్రీ ఉత్తీర్ణులయ్యాక టీచింగ్‌ పట్ల ఆసక్తి ఉంటే.. లీగల్‌ ఫ్యాకల్టీగా లా కాలేజీల్లో  పనిచేయవచ్చు. అంతేకాకుండా పీజీ, ఎల్‌ఎల్‌ఎం వంటి వాటికి కూడా ప్రిపర్‌ కావచ్చు. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 06, 2022
  • వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in


​​​​​​​చ‌ద‌వండి: AP LAWCET 2022 నోటిఫికేషన్ విడుదల... ముఖ్యమైన తేదీలు ఇవే

Last Date

Photo Stories