Skip to main content

Common Entrance Test: డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ యూనివర్శిటీ హార్టిసెట్‌-2023

పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చరల్‌ కోర్సులో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-హార్టిసెట్‌-2023 నోటిఫికేన్‌ను విడుదలచేసింది.
admission in dr ysr horticultural university

మొత్తం సీట్ల సంఖ్య: 92(52 యూనివర్శిటీ కాలేజీ సీట్లు, 40 ప్రైవేట్‌ కాలేజీ సీట్లు)
అర్హత: డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రవేశ పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, డా.వై.ఎస్‌.­ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.
పరీక్ష తేది: 22.08.2023.

వెబ్‌సైట్‌: https://drysrhu.ap.gov.in/

Army Nursing Colleges: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Last Date

Photo Stories