Skip to main content

Army Nursing Colleges: ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

దేశవ్యాప్తంగా ఉన్న కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఏఎఫ్‌ఎంఎస్‌)ల్లో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
B.Sc Nursing Course in Army Nursing Colleges

మొత్తం సీట్ల సంఖ్య: 220
ఏఎఫ్‌ఎంఎస్, సీట్లు: కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, పుణె–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, కోల్‌కతా–30, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, ముంబై–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, న్యూఢిల్లీ–30, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, లక్నో–40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, బెంగళూరు–40.
అర్హత: అవివాహిత/విడాకులు తీసుకున్న/చట్టబద్ధంగా విడిపోయిన/వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50శాతం మార్కులతో ఇంటర్‌(బైపీసీ)/10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నీట్‌(యూజీ) 2023లో అర్హత సాధించి ఉండాలి. కనిష్ట ఎత్తు 152 సెం.మీ. కలిగి ఉండాలి.
వయసు: 01.10.1998 నుంచి 30.09.2006 మధ్య జన్మించిన ఉండాలి.

ఎంపిక విధానం: నీట్‌ 2023 స్కోర్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/జనరల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్, సైకలాజికల్‌ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.07.2023.

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

TS EAMCET BiPC Stream Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూలో యూజీ కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories