Skip to main content

TS EAMCET BiPC Stream Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూలో యూజీ కోర్సులో ప్రవేశాలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీలతోపాటు అనుబంధ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.
Admissions in PJTSAU

డిగ్రీ కోర్సులు-సీట్ల వివరాలు

  • బీఎస్సీ(ఆనర్స్‌)అగ్రికల్చర్‌(నాలుగేళ్లు)-720 సీట్లు.
  • బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌(నాలుగేళ్లు)-43 సీట్లు.
  • బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌(ఐదున్నరేళ్లు)-174 సీట్లు.
  • బీఎఫ్‌ఎస్సీ(నాలుగేళ్లు)-39 సీట్లు.
  • బీఎస్సీ(ఆనర్స్‌)హార్టికల్చర్‌(నాలుగేళ్లు)-204 సీట్లు.

అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజికల్‌ సైన్సెస్, బయోలాజికల్‌ సైన్సెస్‌)తోపాటు టీఎస్‌ ఎంసెట్‌-2023 ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: బీవీఎస్సీ ఏహెచ్‌ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్లు, ఇతర కోర్సులకు 17 నుంచి 22 ఏళ్లు మధ్య ఉండాలి.

RGUKT-AP: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు..

ఎంపిక విధానం: టీఎస్‌ ఎంసెట్‌-2023లో అభ్యర్థులు పొందిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.07.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 18.07.2023 నుంచి 19.07.2023 వరకు

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/

Last Date

Photo Stories