Skip to main content

APRDC CET 2023 Notification: ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల..

గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ.. ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
APRDC CET 2023 Notification

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మే 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం సీట్ల సంఖ్య: 152
గ్రూపు, సీట్లు: బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌)-40 సీట్లు, బీకాం-40 సీట్లు, బీఎస్సీ (మ్యాథ్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ)-36 సీట్లు,బీఎస్సీ(మ్యా థ్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌)-36 సీట్లు.
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

చ‌ద‌వండి: APRJC CET 2023 Notification: ఏపీ ఆర్‌జేసీ సెట్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల.. పరీక్ష విధానం ఇదే..

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.04.2023.
హాల్‌ టికెట్‌ల జారీ తేది: 12.05.2023.
ప్రవేశ పరీక్షతేది: 20.05.2023.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/

చ‌ద‌వండి: Admissions in KVS: ఒకటి నుంచి 11వ తరగతి వరకు... యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌; ప్రవేశ విధానం.. ముఖ్య‌ వివరాలు ఇవే.. 

Last Date

Photo Stories