APRJC CET 2023 Notification: ఏపీ ఆర్‌జేసీ సెట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల.. పరీక్ష విధానం ఇదే..
గ్రూప్స్: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ.
మొత్తం సీట్ల సంఖ్య: 1149
అర్హత: 2023 ఏప్రిల్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నాపత్రం తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.04.2023.
హాల్‌టికెట్ జారీ తేది: 12.05.2023.
ప్రవేశ పరీక్ష తేది: 20.05.2023.
వెబ్‌సైట్: https://aprs.apcfss.in/