Skip to main content

Entrance Exam 2024: ఏపీఆర్‌జేసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీఆర్‌జేసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Entrance Exam 2024   applications for admissions in APRJC   Admission Application Form
Entrance Exam 2024: ఏపీఆర్‌జేసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పరిగి: ఏపీఆర్‌జేసీలో ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు పరిగి మండలం కొడిగెనహళ్లిలోని ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని ఏడు జూనియర్‌ కళాశాలలతో పాటు నాగార్జున సాగర్‌లోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏపీఆర్‌ఎస్‌ సాధారణ, మైనార్టీ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశంతో పాటూ 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో మెరిట్‌ను పరిగణలోకి తీసుకొని సీట్లను భర్తీ చేయనున్నారు.

Also Read :  APRJC CET 2024 Details 

Published date : 23 Mar 2024 12:47PM

Photo Stories