Skip to main content

APRJC CET 2024 Details : ఏపీఆర్‌జేసీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఏపీఆర్ జేసీ సెట్-2024 నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు.
Admissions Open for First Year Intermediate Andhra Pradesh Residential Educational Institutions Society    APR JC SET-2024 Notification

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 (బాలురు, బాలికలు) గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం సీట్లు 1,149 ఉన్నాయి.

అర్హ‌తలు ఇవే..
2023-24 ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ముఖ్య‌మైన తేదీలు ఇలా..
అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షతేది 2024 ఏప్రిల్ 25. దరఖాస్తు ఫీజు: రూ.300గా నిర్ణయించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఇంట‌ర్ గ్రూపులు :

ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ,

ఎంపిక విధానం : 
ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లును కేటాయిస్తారు.

పరీక్ష విధానం : 
ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్, ఉర్దూ/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
పూర్తి వివరాలకు :  https://aprs.apcfss.in/aprjc-index వెబ్‌సైట్‌ చూడొచ్చు.

APRJC CET 2024 - Important Date:

 

Events

 

Dates

 

Date of opening of online application

 

March 01, 2024

 

Last Date for submit online application

 

March 31, 2024

 

Date of issue of Hall Tickets

 

April 17, 2024

 

Date of Examination

 

April 25, 2024  (2.30 PM to 5 PM)

 

Date of Publication of Results

 

May 14, 2024

 

Dates of 1st phase Counselling for Andhra & Rayalaseema Region

 

For MPC / EET 

 

May 20, 2024

 

For BPC / CGT 

 

May 21, 2024

 

For MEC / CEC 

 

May 22, 2024

 

Dates of 2nd phase Counselling for Andhra & Rayalaseema Region

 

For MPC/ EET

 

May 28, 2024

 

For BPC/ CGT

 

May 29, 2024

 

For MEC/ CEC

 

May 30, 2024

 

Dates of 3rd phase Counselling for Andhra & Rayalaseema Region

 

For MPC/ EET

 

June 05, 2024

 

For BPC/ CGT

 

June 06, 2024

 

For MEC/ CEC

 

June 07, 2024


APRJC CET 2024-25 Notification PDF : 

PDF
Published date : 11 Mar 2024 01:30PM

Photo Stories