Skip to main content

UPSC-CDS‌ (2) 2022: డిగ్రీతో త్రివిధ దళాల్లో కొలువులు.. నెలకు రూ.56,100 స్టయిపెండ్‌

upsc cds 2 2022 notification
upsc cds 2 2022 notification details

సీడీఎస్‌ఈ.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. దేశ భద్రతలో కీలకంగా నిలుస్తున్న.. త్రివిధ దళాల్లో కొలువు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది! పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో కెరీర్‌ ప్రారంభించేందుకు  మార్గం సుగమం అవుతుంది! శిక్షణ సమయంలోనే ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది.  యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ.. ప్రతి ఏటా రెండుసార్లు సీడీఎస్‌ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. తాజాగా సీడీఎస్‌(2)–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ ద్వారా భర్తీ చేసే పోస్ట్‌లు, విభాగాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ..

  • సీడీఎస్‌(2)–2022 నోటిఫికేషన్‌ విడుదల
  • శిక్షణ సమయం నుంచే ఆర్థిక ప్రోత్సాహకం
  • శిక్షణ తర్వాత పర్మనెంట్‌ కమిషన్‌తో కొలువు
  • సీడీఎస్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక ప్రక్రియ

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించి..తదుపరి దశల్లోనూ రాణిస్తే.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాతో కొలువుకు మార్గం సుగమం అవుతుంది. త్రివిధ దళాల్లోని(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌) నాలుగు విభాగాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా నిర్దేశించిన ఈ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించి సీడీఎస్‌(2)–2022కు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు తేదీలను, రాత పరీక్ష తేదీలను కూడా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది.

మొత్తం 339 పోస్టులు

  • కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(2)–2022 ద్వారా త్రివిధ దళాలకు చెందిన నాలుగు అకాడమీల్లోని 339 పోస్టులను భర్తీ చేయనున్నారు. సదరు అకాడమీలు, ఖాళీల వివరాలు.. 
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌): 100
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా): 22
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌): 32
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(పురుషులు): 169
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(మహిళలు): 16
  • మొత్తం ఖాళీలు: 339

అర్హతలు

  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి. అదే విధంగా..డీజీసీఏ జారీచేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉండకూడదు. సీడీఎస్‌ కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. 
  • ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీలకు ఎంపికైన వారు జూలై1, 2023లోపు, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైన వారు మే13, 2023లోపు, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి ఎంపికైన వారు అక్టోబర్‌ 1, 2022 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. 
  • ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ చూపించాలి. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మాత్రమే అర్హులు.

వయసు

  • ఇండియన్‌ మిలిటరీ అకాడమీ: జూలై 2, 1999– జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.
  • నేవల్‌ అకాడమీ: జూలై 2, 1999 – జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: జూలై 2, 1999 – జూలై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి. 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: జూలై 2, 1998–జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశలుగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో మొదటిది..యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్‌ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిస్తే.. మలిదశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిస్తే.. ఎంపిక చేసుకున్న విభాగంలో కొలువు ఖాయం.

NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

రాత పరీక్ష.. రెండు విధాలుగా

  • సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ తరహాలో రాత పరీక్ష జరుగుతుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. రాత పరీక్ష వివరాలు...

ఐఎంఏ, నేవల్, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ పరీక్ష

సబ్జెక్ట్‌ వ్యవధి మార్కులు
ఇంగ్లిష్‌ 2 గంటలు  100
జనరల్‌ నాలెడ్జ్‌ 2 గంటలు  100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 2 గంటలు  100


ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పరీక్ష

సబ్జెక్ట్‌  వ్యవధి మార్కులు
ఇంగ్లిష్‌  2 గంటలు  100
జనరల్‌ నాలెడ్జ్‌  2 గంటలు 100

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ

రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు. మిగతా అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు జరుగుతుంది. దీనికి కేటాయించిన మార్కులు 300. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిద్వారా ఆఫీసర్‌ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు.

UPSC CDS-II 2022: నోటిఫికేషన్‌ విడుదల... 339 ఉద్యోగాలు! 

తుది దశ.. ఇంటర్వ్యూ

సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్‌ టెస్ట్‌లు పూర్తయ్యాక చివరగా.. బోర్డ్‌ ప్రెసిడెంట్‌ లేదా సీనియర్‌ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా చివరగా కాన్ఫరెన్స్‌ ఉంటుంది. ప్యానెల్‌ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిస్ట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించుకున్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

శిక్షణ సమయంలో స్టయిపెండ్‌

  • అన్ని దశల్లోనూ విజయం సాధించి.. ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణ సమయంలో జెంటిల్‌మెన్‌ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలిచే ట్రైనీలకు నెలకు రూ.56,100 స్టయిపెండ్‌ అందిస్తారు. నిర్దేశిత వ్యవధిలో ఉండే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్‌ హోదా స్థాయిలో పర్మనెంట్‌ కొలువు సొంతమవుతుంది. 
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌)లో 18 నెలలు; నేవల్‌ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. 
  • ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ప్రవేశించవచ్చు. 
  • నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌–లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది. 
  • ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.

UPSC NDAN-NA(2) 2022: నోటిఫికేషన్‌ విడుదల... 400 ఉద్యోగాలు!

పరీక్షలో ప్రతిభ చూపాలంటే

సీడీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు..

ఇంగ్లిష్‌

వంద మార్కులకు 120 ప్రశ్నలు అడిగే ఇంగ్లిష్‌ విభాగంలో.. ఇంగ్లిష్‌ భాషపై పట్టును, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఆర్డరింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్టోజ్‌ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్‌ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్‌ రూల్స్‌ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెసెస్‌ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 

జనరల్‌ నాలెడ్జ్‌

అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహనని పరీక్షించే విభాగమిది. 100 మార్కులకు ఉండే ఈ విభాగంలో.. 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్‌ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్‌–అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌

ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్‌ విభాగం ఉంటుంది. వంద ప్రశ్నలు– వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ, వాల్యూమ్‌ అండ్‌ సర్ఫేస్‌ ఏరియా, లీనియర్‌ అండ్‌ క్వాడ్రటిక్‌ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్‌ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. 

UPSC NDA, NA(2) 2022: ఇంటర్‌ అర్హతతోనే ఎవర్‌గ్రీన్‌ కెరీర్‌... శిక్షణ సమయంలోనే రూ.56,100 స్టైపెండ్‌

కెరీర్‌ ఇలా

సీడీఎస్‌ పరీక్షలో విజయం సాధించిన వారికి త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌; కెప్టెన్‌; మేజర్‌; లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌;బ్రిగేడియర్‌; మేజర్‌ జనరల్‌; లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హెచ్‌ఏజీ స్కేల్‌; ఆర్మీ కమొడోర్‌/లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హోదాల్లో కొలువులు లభిస్తాయి. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు, సర్వీస్‌ రూల్స్‌ మేరకు ప్రతి ఆరు సంవత్సరాలకు పదోన్నతి లభిస్తుంది. ఇలా పదవీ విరమణ సమయానికి ఆయా విభాగాల్లో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చు.

సీడీఎస్‌ఈ(2)–2022 ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 7, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఉప సంహరణ తేదీలు: జూన్‌ 14–జూన్‌ 20, 2022
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 4, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://upsconline.nic.in, www.upsc.gov.in

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Jun 2022 05:10PM

Photo Stories