Skip to main content

Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివ‌రాలు ఇలా..

AWES released notification for recruitment of Teacher posts in Army Public Schools
AWES released notification for recruitment of Teacher posts in Army Public Schools

బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ స్కూల్‌ టీచర్‌. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సిద్ధమైంది. తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు...

దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్‌ఈకి అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ.. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.

పోస్టుల వివరాలు

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)
  • ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ) 


చ‌ద‌వండి: APS Recruitment: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

అర్హతలు

  • పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ)తోపాటు 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • టీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, బీఈడీలో ఉత్తీర్ణత సాధించాలి.
  • పీఆర్‌టీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు.

వయోపరిమితి

  • ఐదేళ్లకు తక్కువగా టీచింగ్‌ అనుభవం ఉన్న అభ్యర్థులకు వయోపరిమితి 40 ఏళ్లు. ఐదేళ్లకు పైగా టీచింగ్‌ అనుభవం ఉండి, 57 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

  • ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌–ఎలో 80 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 120 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌–బిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులకు చెందిన వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌–ఎ కాలవ్యవధి గంటన్నర, పార్ట్‌–బి కాలవ్యవధి రెండు గంటలు. అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు ప్రతి పార్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కులు కోత విధిస్తారు. 

పార్ట్‌–ఎ

సెక్షన్‌  ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ(బేసిక్‌ జీకే) 28 35%
సెక్షన్‌–బి(కరెంట్‌ అఫైర్స్‌) 28 35%
సెక్షన్‌–సి(ప్రొఫెషనల్‌ నాలెడ్డ్‌) 24 30%
మొత్తం 80 ప్రశ్నలు  

పార్ట్‌–బి (టీజీటీ)

సెక్షన్‌ ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ 42 35%
సెక్షన్‌–బి 42 35%
సెక్షన్‌–సి 12 10%
సెక్షన్‌–డి 24 20%
మొత్తం 120 ప్రశ్నలు  

పార్ట్‌–బి(పీజీటీ)

సెక్షన్‌ ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ 42 35%
సెక్షన్‌–బి 42 35%
సెక్షన్‌–సి 36 30%
మొత్తం 120 ప్రశ్నలు  
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి 28 
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: 2022 ఫిబ్రవరి 10
  • ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 2022 ఫిబ్రవరి 19, 20
  • ఫలితాల వెల్లడి: 2022 ఫిబ్రవరి 28
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, హైదరాబాద్‌
  • వివరాల కోసం వెబ్‌సైట్‌ https://www.awesindia.com/ చూడొచ్చు. 


చ‌ద‌వండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

ప్రిపరేషన్‌

ఆర్మీ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా పరీక్ష స్వరూపంపై అవగాహన పెంచుకోవాలి. వివిధ విభాగాల్లోని సెక్షన్లలో వెయిటేజీకి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. పార్ట్‌–ఎలోని సెక్షన్‌–ఎకి చెందిన బేసిక్‌ జీకేలో సోషల్‌ సైన్స్, జనరల్‌ సైన్స్‌కు సంబంధించిన జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలపై పట్టు సాధించాలి. వీటికోసం ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఆరు నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాలను చదవాలి. మెంటల్‌ ఎబిలిటీ, కాంప్రహెన్షన్‌ అంశాలను కూడా సాధన చేయాలి. సెక్షన్‌–బిలో కరెంట్‌ అఫైర్స్‌లో మార్కుల సాధనకు జాతీయ స్థాయి కరెంట్‌ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, ముఖ్యమైన సంఘటనలకూ వెయిటేజీ ఉంది. కాబట్టి వాటిని కూడా నేర్చుకోవాలి. సెక్షన్‌–సికి సంబంధించిన ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌లో.. బీఈడీ/టీచింగ్‌ ప్రాక్టీసెస్, సీబీఎస్‌ఈ నిబంధనలు, ఈసీసీఈ, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) తదితర అంశాలతోపాటు ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్, ఇన్ఫోటెక్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 
పార్ట్‌–బిలో.. టీజీటీ/పీజీటీకి చెందిన సబ్జెక్టుల్లోంచి నాలెడ్జ్, అనువర్తిత ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ల వారీగా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ప్రిపరేషన్‌ కొనసాగించాలి. టీజీటీ అభ్యర్థులు ఆరోతరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు, పీజీటీ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ స్థాయి వరకు.. సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై పట్టు పెంచుకోవాలి.

చ‌ద‌వండి: Defence Courses

Published date : 13 Jan 2022 05:57PM

Photo Stories