APS Recruitment: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ(ఏడబ్ల్యూఈఎస్).. దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
పోస్టుల వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ), ప్రైమరీ టీచర్(పీటీ).
అర్హతలు
- పీజీటీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రైమరీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
- తాజా అభ్యర్థుల(ఐదేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్నవారు)వయసు 40ఏళ్ల లోపు ఉండాలి
- అనుభవం ఉన్న అభ్యర్థులు(ఐదేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు) వయసు 57ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022
అడ్మిట్ కార్డుల అందుబాటు: 10.02.2022 నుంచి
పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి19, 20
వెబ్‌సైట్: https://www.awesindia.com/
చదవండి: Faculty Jobs: ఏవీఐఎన్‌యూటీవైలో 93 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |