Skip to main content

UPSC CDS(1) 2023 Notification: డిగ్రీతో.. డిఫెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. విజయం సాధించాలంటే..

సీడీఎస్‌ఈ.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌!! త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకులో..ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ఇందులో విజయం సాధిస్తే.. కొలువు ఖరారు కావడమే కాకుండా.. శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకు పైగా స్టయిఫండ్‌ పొందొచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతోనే సీడీఎస్‌కు పోటీపడొచ్చు. ఇటీవల యూపీఎస్‌సీ.. సీడీఎస్‌(1)-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..సీడీఎస్‌ పరీక్ష వివరాలు, భర్తీ చేయనున్న పోస్ట్‌లు, అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ..
UPSC CDS 1 2023 Notification and exam pattern & syllabus
  • సీడీఎస్‌(1)-2023 నోటిఫికేషన్‌ విడుదల
  • త్రివిధ దళాలకు చెందిన 5 అకాడమీల్లో 341 పోస్ట్‌లు
  • డిగ్రీ, బీటెక్‌ అర్హతలతో పోటీ పడే అవకాశం
  • శిక్షణ సమయంలోనే నెలకు రూ.56,100 స్టయిఫండ్‌

దేశ సేవ చేయాలనే తపన, దేశ రక్షణకు పాటుపడాలనే తెగువ ఉన్నవారికి చక్కటి అవకాశం.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేసన్‌. ఈ పరీక్షలో విజయంతోపాటు తదుపరి ఎంపిక ప్రక్రియలో నెగ్గితే.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, విభాగాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాతో కొలువు సొంతం చేసుకోవచ్చు.

అయిదు విభాగాలు.. 341 పోస్ట్‌లు

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(1)-2023 ద్వారా త్రివిధ దళాలకు చెందిన అయిదు విభాగాల్లోని 341 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. అవి.. ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌): 100; ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా):22;  ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌): 32; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై) (పురుషులు): 170; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(మహిళలు): 17.

అర్హతలు

  • ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ /బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్‌ పైలట్‌ లెసైన్స్‌ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు ఉంటుంది. 
  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: UPSC NDA & NA (1)-2023 Notification: ఇంటర్‌తోనే.. డిగ్రీ+కొలువు

వయసు

  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ: జనవరి 2, 2000-జనవరి1, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.
  • నేవల్‌ అకాడమీ: జనవరి 2, 2000-జనవరి 1, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: జనవరి 2, 2000- జనవరి 1, 2004 మధ్యలో జన్మించి ఉండాలి(డీజీసీఏ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్న వారికి రెండేళ్ల సడలింపు ఇస్తారు). 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: జనవరి 2,1999 - జనవరి 1, 2005 మధ్యలో జన్మించి ఉండాలి.

రెండు దశల ఎంపిక ప్రక్రియ

సీడీఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట యూపీఎస్‌సీ  సీడీఎస్‌ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిస్తే.. మలి దశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ  ప్రక్రియలోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో కెరీర్‌ ఖరారవుతుంది.

రాత పరీక్ష ఇలా

  • ఇండియ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరిగే రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. 
  • ఐఎంఏ, నేవల్, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలకు జరిగే రాత పరీక్షలో.. మూడు విభాగాలు.. ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 100 మార్కులకు చొప్పున ఉంటాయి. ప్రతి విభాగానికి  పరీక్ష సమయం రెండు గంటలు. 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ జరిగే పరీక్షలో.. రెండు విభాగాలు ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ వంద మార్కులకు చొప్పున ఉంటాయి. వీటికి ప్రతి విభాగానికి పరీక్ష సమయం రెండు గంటలు. 
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.
  • రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ టెస్ట్‌ జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో త్రివిధ దళాల్లో కొలువులు

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ

  • సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల ఆధ్వర్యంలో జరిగే ఎంపిక ప్రక్రియ 300 మార్కులకు ఉంటుంది. పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • మొదటి దశ స్టేజ్‌-1లో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌(ఓఐఆర్‌) టెస్ట్‌లు, స్టేజ్‌-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
  • స్టేజ్‌-1, స్టేజ్‌-2ల తర్వాత వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌(డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌(ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా అభ్యర్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. 
  • చివరగా సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత  రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్‌ టాస్క్‌లు నిర్వహిస్తారు.

చివరగా ఇంటర్వ్యూ

ఎంపిక ప్రక్రియలోని రెండు దశల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా.. ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూను బోర్డ్‌ ప్రెసిడెంట్‌ లేదా సీనియర్‌ సభ్యుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలోనే ఒక ప్రక్రియగా కాన్ఫరెన్స్‌ ఉంటుంది. ప్యానెల్‌ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిస్ట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు.ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

చ‌ద‌వండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!

శిక్షణ, స్టయిఫండ్‌

సీడీఎస్‌ ఎంపిక ప్రక్రియలో నెగ్గిన అభ్యర్థులకు ఆయా అకాడమీల్లో  శిక్షణ ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌)లో 18 నెలలు; నేవల్‌ అకాడమీలో 17 నెలలు; ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్‌ హోదాలో పర్మనెంట్‌ కొలువు సొంతమవుతుంది. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌-లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది.ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందినవారు ప్రారంభంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో సదరు విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

విజయం సాధించాలంటే

  • ఇంగ్లిష్‌: 120 ప్రశ్నలతో వంద మార్కులకు జరిగే ఇంగ్లిష్‌ విభాగంలో.. ఇంగ్లిష్‌ భాషపై పట్టును, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఆర్డరింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెసెస్, క్లోజ్డ్‌æ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్‌ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్‌ రూల్స్‌ తెలుసుకోవాలి. 
  • జనరల్‌ నాలెడ్జ్‌: అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహనను పరీక్షించే విభాగమిది. 100 మార్కులకు-120 ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ,ఇండియన్‌ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
  • ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు  మ్యాథమెటిక్స్‌ విభాగం ఉంటుంది. వంద ప్రశ్నలు-వంద మార్కులకు పరీక్ష జరిగే విభాగం ఇది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్‌ అండ్‌ డిస్టెన్స్,స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ,వాల్యూమ్‌ అండ్‌ సర్ఫేస్‌ ఏరియా, లీనియర్‌ అండ్‌ క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్‌ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.   

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఫ్రొపైల్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి10,2023
  • సీడీఎస్‌ఈ(1)-2023 పరీక్ష తేదీ: ఏప్రిల్‌16,2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
  • వెబ్‌సైట్‌: https://upsconline.nic.in , www.upsc.gov.in

చ‌ద‌వండి: UPSC CDS 1 2023 Notification: 341 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 04 Jan 2023 07:02PM

Photo Stories