UPSC CDS 1 2023 Notification: 341 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 341
విభాగాల వారీగా ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్-100, ఇండియన్ నావల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల-22, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), ౖహైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్-17.
అర్హత: మిలిటరీ అకాడమి, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమి పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నేషనల్ అకాడమి ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్ మిలిటరీ అకాడమి, నావల్ అకాడమిలకు 02.01.2000 కంటే ముందు, 01.01.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎయిర్‌ఫోర్స్ అకాడమి పోస్టులకు 02.01.2000 కంటే ముందు, 01.01.2004తర్వాత జన్మించిన వారు అనర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమి పోస్టులకు 02.01.1999 కంటేæ ముందు, 01.01.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమి(ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.
ఇంటర్వ్యూ: ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కీలకం. పరీక్షతో సమానంగా ఈ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.01.2023
పరీక్ష తేది: 16.04.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
వెబ్‌సైట్: http://upsc.gov.in
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |