Skip to main content

Indian Army Notification 2024: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 56వ కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 56వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Short Service Commission application form    Indian Army  Indian Army Notification 2024 for NCC Special Entry Scheme  NCC Special Entry Scheme 56th Course

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎన్‌సీసీ పురుషులు–50, ఎన్‌సీసీ మహిళలు–05. ఈ రెండు విభాగాల్లోనూ 6(పురుషులు5, మహిళలు1) పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌లో కనీసం బిగ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌ అవసరం లేదు.
వయసు: 01.07.2024 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1, స్టేజ్‌–2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

శిక్షణ, వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్శిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.02.2024

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

చదవండి: Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 06,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories