Skip to main content

Indian Navy Recruitment 2024: ఇండియన్‌ నేవీలో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌ బ్రాంచుల్లో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అ­వివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
10+2 B.Tech Cadet Entry Scheme     Indian Navy Cadet Entry Scheme    Join the Indian Naval Academy for Executive and Technical Branch Training

మొత్తం ఖాళీల సంఖ్య: 35 (మహిళలకు 10 ఖాళీలు కేటాయించారు).
కోర్సు వివరాలు: 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌(పర్మనెంట్‌ కమిషన్‌).
బ్రాంచ్‌: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్‌.
కోర్సు ప్రారంభం: 2024 జూలైలో.
వయసు: 02.01.2005 నుంచి 01.07.2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
అర్హత: కనీసం 70శాతం మార్కులతో సీనియర్‌ సెకండరీ పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ(మెయిన్‌) పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్‌) ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

చదవండి: Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories