Skip to main content

Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భారత వాయుసేన.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు(01/2025) నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Agnipath Scheme   Indian Airforce Agniveer Recruitment 2024    Indian Air Force    Recruitment Notifications

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ఇంటర్మీడియట్‌(సైన్స్‌ కాని ఇతర సబ్జెక్టులు)/ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 02.01.2004 నుంచి 02.07.2007 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఫేజ్‌–1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌–2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌–1, అడాప్టబిలిటీ టెస్ట్‌–2), ఫేజ్‌–3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 17.01.2024.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువుతేది: 06.02.2024.
ఆన్‌లైన్‌ పరీక్ష ప్రారంభ తేది: 17.03.2024.

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/

చదవండి: Indian Navy Recruitment 2024: ఇండియన్‌ నేవీలో 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date February 06,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories