Skip to main content

Telangana: రేపటి నుంచే విద్యాసంస్థలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రి

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలలు, కళాశాలలను ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి తెరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. విద్యాసంస్థలన్నీ ఏర్పాట్లు మొదలుపెట్టాయి.
Telangana schools
Telangana schools

ఇప్పటికే ప్రైవేటు సంస్థలు చాలా వరకు ప్రత్యక్ష తరగతులకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలన్నింటా ఆది, సోమవారాల్లో వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటికీ తొలుత జ‌న‌వ‌రి 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 31వ తేదీ వరకు కూడా తెరవొద్దని ఆదేశించింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి తెరిచేందుకు అనుమతించింది. 

ఈ నిబంధనలకు అనుగుణంగానే.. 
రాష్ట్రవ్యాప్తంగా 42,575 పాఠశాలలు ఉన్నాయి. అందులో 20,752 ప్రై మరీ, 7,471 అప్పర్‌ ప్రై మరీ, 11,921 సెకండరీ, 2,431 హయ్యర్‌ సెకండరీ పాఠశాలలు. మొత్తం స్కూళ్లలో దాదాపు 26 వేల వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలో పరిశుభ్రత, జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని శానిటైజేషన్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందుకోసం జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని, మండల స్థాయి కమిటీలు కూడా పనిచేస్తాయని చెప్పారు. స్థానిక పంచాయతీల సహకారంతో స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. గదులను పరిశుభ్రంగా ఉంచడం, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలుచేస్తామని తెలిపారు.

వ్యక్తిగత శానిటైజర్లను అనుమతిస్తామని.. విద్యాసంస్థల్లోనూ ప్రత్యేకంగా ఈ సదుపాయం ఉంటుందని పాఠశాల విద్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మొదట ఓ వారం రోజుల వరకు 5వ తరగతిలోపు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని.. పై తరగతుల వారు యధావిధిగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇక్క‌డ ఆలస్యంగానే.. 
హాస్టళ్లలో సమగ్ర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు హాస్టళ్లు తెరిచినా.. విద్యార్థుల శాతం పరిమితంగానే ఉంచే వీలుందని అంటున్నారు. దగ్గర్లోని విద్యార్థులను వారం రోజుల పాటు ఇళ్ల నుంచే స్కూలుకు వెళ్లాలని మౌఖిక ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. 

అర్హత ఉన్న విద్యార్థులకు..
సెలవు రోజుల్లో అర్హత ఉన్న విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ చేపట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనివల్ల టెన్త్‌ పరీక్షల నాటికి విద్యార్థుల్లో చాలావరకూ వ్యాధి నిరోధక శక్తి ఉండే వీలుందని పేర్కొన్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు ముందే వ్యాక్సినేషన్‌ చేపట్టామని.. వారికి పరీక్షల నాటికి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నామని వెల్లడించాయి. ఏదేమైనా ఇక నుంచి మిగిలిన విద్యా సంవత్సరమంతా బోధన ముమ్మరంగా సాగుతుందని అధ్యాపకవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటు ఏపీలో మాత్రంలో..
పాఠశాలలు మ్యాపింగ్‌ వల్ల పాఠశాలలు రద్దు కావడం, మూతపడటం జరగదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్‌ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

పాఠశాలలు రద్దు కావని.. 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. స్కూళ్ల మ్యాపింగ్‌ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.

పాఠశాలల మ్యాపింగ్‌ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్‌ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.

త‌గ్గెదేలే...?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి త‌ర్వాత ప్రారంభిస్తామ‌న్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 31 Jan 2022 07:15PM

Photo Stories