Skip to main content

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులు జ‌న‌వ‌రి 30తో ముగుస్తాయి.
Telangana Schools Holidays
Telangana Schools Holidays

ఈ నేపథ్యంలో జ‌న‌వ‌రి 31 నుంచి విద్యా సంస్థలను తెరుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించ లేదు. విద్య, వైద్య శాఖల నివేదికలు అందిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయం ఓ నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ మాత్రం 31 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం కష్టమనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

ఒకవేళ ప్రత్యక్ష బోధన చేపట్టాల్సి వస్తే..
దీంతో పాఠశాలలను తెరిచేందుకు సిబ్బందిని, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయలేదు’ అని పాఠశాల విద్యా శాఖాధికారి ఒకరు తెలిపారు. 50 శాతం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఇప్పటికే విధులకు హాజరవుతున్నారు. ఒకవేళ ప్రత్యక్ష బోధన చేపట్టాల్సి వస్తే కోవిడ్‌ నిబంధనల మేరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపైనే అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

తెరవడం సమస్యే..
జ‌న‌వ‌రి 8వ తేదీ నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. అప్పట్నుంచీ తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్ల పరిశుభ్రత గురించి పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం రెండు రోజుల పాటు వాటిని రసాయనాలతో శుభ్రం చేసి వాడాల్సి ఉంటుందని పాఠశాల హెచ్‌ఎంలు అంటున్నారు. స్థానిక పారిశుధ్ధ్య సిబ్బంది సహకారం అంతంత మాత్రంగానే ఉందని క్షేత్రస్థాయి సిబ్బంది అంటున్నారు.

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

జ‌న‌వ‌రి 31 నుంచి పునఃప్రారంభం కష్టమేనని..?
ఈ నేపథ్యంలో జ‌న‌వ‌రి 31 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. అదీగాక వైద్య ఆరోగ్య శాఖ నుంచీ స్పష్టమైన భరోసా లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించాలి.. అవసరమైతే వైద్య పరీక్షలు చేయాలి. వైద్యశాఖ సమన్వయంతోనే ఇవన్నీ సాధ్యమని విద్యాశాఖ చెబుతోంది. 

తప్పనిసరి చేయకూడదనే...
విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించినా.. విద్యార్థులను పాఠశాలలకు పంపుతారా? అనే సందేహాలను ఉపాధ్యాయ వర్గాలు లేవనెత్తుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల హాజరును తప్పనిసరి చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పునఃప్రారంభించినా పాఠశాలలకు వచ్చే వాళ్ళు వస్తారు.. రానివాళ్ళు టీ–శాట్, డీడీ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు కల్పించడమే మంచిది’ అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే నిర్ణయం..
ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నాయి. 63 శాతం వరకూ వీటిని వింటున్నారు. ఆన్‌లైన్‌ అందుబాటులో లేని విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరై, మిగతా వారిలో కొంతమంది ఆన్‌లైన్‌కే పరిమితమైనా... తరగతి గదిలో కోవిడ్‌ నిబంధనల మేరకు విద్యార్థులుండే వీలుందని అధికారులు అంటున్నారు. అన్ని వివరాలతో ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలిపే నివేదిక పంపామని పాఠశాల విద్యా శాఖాధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.   

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

ఏపీలో స్కూళ్లకు, కాలేజీల‌కు సెల‌వుల‌పై త‌గ్గెదేలే...?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి త‌ర్వాత ప్రారంభిస్తామ‌న్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 29 Jan 2022 01:11PM

Photo Stories