Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలలను జనవరి 31 వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 1 నుంచి 9, అలాగే 11 తరగతి వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని పేర్కొంది. 1-9 తరగతి విద్యార్థులకు ముందుగా నిర్ధేశించిన విధంగా ఆన్‌లైన్ క్లాస్‌లకు కొనసాగుతాయని పేర్కొంది.
మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా...
ముంబైలో తాజాగా 8,063 కోవిడ్ కేసులు నమోదైన తరువాత ముంబై కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 29,819కు చేరింది. అదేవిధంగా ముంబైలో ఒమిక్రాన్ కేసులు 328కి పెరిగాయి. ఇక మహారాష్ట్రలో ఆదివారం 11,877 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే 29 శాతం ఎక్కువ. మరోవైపు మహారాష్ట్రలో కొత్తగా 50 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పుణె నుంచి అత్యధికంగా 38 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 510కి చేరుకుంది.
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..