Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది.
School Holidays
తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక పాఠశాలలు, కాలేజీలకు సెలవులను ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి, ఒమిక్రాన్ ఉధృతి కారణంతో ప్రభుత్వ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఢిల్లి, హర్యానా, తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించాయి. ఈ దిశలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఉంది.