విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
పతాక స్థాయికి వెళ్లే ప్రమాదం..?
రాబోయే రెండు వారాలు కేసులు పతాక స్థాయికి వెళ్లే ప్రమాదం ఉన్నందున జనవరి 16తో ముగుస్తున్న హాలిడేస్ ను మరో రెండు వారాలు పొడిగిస్తే బెటర్అని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి అంతర్గతంగా వివరించింది. చిన్న పిల్లలలో వ్యాప్తి పెరగకుండా ఈ నిర్ణయం మేలును చేకూరుస్తుందని స్పష్టం చేసింది.ఇందు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ ద్వారా క్లాసులను బోధించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీల ద్వారా కూడా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
సీఎం మరోసారి..
ఈ రెండు వారాల పాటు కట్టడి చర్యలను సీరియస్ గా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ నొక్కి చెప్పింది. అయితే ఈ అంశంపై సీఎం మరోసారి సమీక్ష నిర్వహించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. స్కూళ్లు, హాస్టళ్లు తెరవడం వలన ఒమిక్రాన్ కు ఇవి హాట్ స్పాట్లుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువ స్కూళ్లల్లో వ్యాప్తి జరిగితే బెడ్లు, మ్యాన్ పవర్ సరిపోదని వైద్యారోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో కనీసం ఈ రెండు వారాల పాటు పిల్లలకు సెలవులు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్యశాఖలోని అధికారులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. సెలవులను పొడిగించడం వలన విద్యార్ధులకు కొంత వరకు నష్టం జరిగినా, ప్రాణాలు కంటే ఏదీ ముఖ్యం కాదు కదా? అంటూ ఉన్నతాధికారులు వ్యాఖ్యనిస్తున్నారు.
సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని..
జనవరి 20 వరకు కేంద్రం కరోనా ఆంక్షలు పొడిగించడం, వైరస్ కట్టడి దిశగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టడాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. విద్యాసంస్థల్లో శానిటైజేషన్ అమలుపైనా క్షేత్ర స్థాయిలో అనుమానాలున్నాయి. వీటిని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సంక్రాంతి సెలవులను పొడిగించడం సరైన నిర్ణయమని ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితిపై విద్యాశాఖ మంత్రి కూడా నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో అధికారులు తాజా పరిస్థితిపై సమగ్ర వివరాలు ఇచ్చినట్లు ఓ అధికారి చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందని, సాధ్యమైనంత వరకూ సెలవుల పొడిగింపు వైపే ఆలోచన సాగుతోందని అధికారులు చెబుతున్నారు.
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..