Skip to main content

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

సాక్షి, ఎడ్యుకేష‌న్ : రాష్ట్రంలో బడులు తెరుచుకున్నా పిల్లల్ని బడికి పంపించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు.
Holidays
Holidays

జ‌న‌వ‌రి 24 (సోమవారం) నుంచి బడులు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సగానికిపైగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది. రాష్ట్రంలో కరోనా మూడో విడతలో కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఫిబ్రవరి 15 వరకు విద్యాసంస్థల్ని రాష్ట్రప్రభుత్వం మూసివేసిన నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ నిన్న మొన్నటివరకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభించ వచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో బడులు తెరిచేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ఫ్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ వారు రాష్ట్రంలోని టైర్‌ 1, టైర్‌ 2, టైర్‌ 3, టైర్‌4 నగరాల్లో సుమారు 4976 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించారు. ఈ సర్వేలో 62%మంది తమ పిల్లల్ని సోమవారం నుంచి బడులకు పంపించేందుకు సిద్ధంగా లేరని వెల్లడైంది.  67% మంది పురుషులు, 33 శాతం మంది మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అయితే 11 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. 16 శాతం మంది ఇప్పటికే తమ పిల్లల్ని బడులకు పంపిస్తున్నట్లు తేలింది. అదేసమయంలో 11 శాతం మంది ఏ నిర్ణయాన్ని చెప్పలేదు.  


తెలంగాణ మాత్రం విద్యాసంస్థల పునః ప్రారంభం అప్పటి నుంచే..
విద్యా సంస్థలను జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని జ‌న‌వ‌రి 20వ తేదీన‌ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం జ‌న‌వ‌రి 30 వరకూ పొడిగించింది. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో విద్యా బోధన కుంటుపడిందన్న వాదన కూడా విన్పిస్తోంది.

సెలవులు పొడిగించకతప్పదనే..
తాజా పరిస్థితిని గమనిస్తే కోవిడ్‌ తీవ్రత జ‌న‌వ‌రి నెలాఖరుకు క్రమంగా తగ్గుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 31 నుంచి విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై అధికారుల నుంచి నివేదిక కోరినట్టు మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, కరోనా తీవ్రత పెరిగితే సెలవులు పొడిగించకతప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులపై క్లారిటీ ఇవ్వకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించగా, కొద్ది రోజుల కోసం ఎందుకన్నట్టు బదులిచ్చారు. దీన్నిబట్టి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం బలమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.  

ఈ సారి పరీక్షలను..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్‌ చేయడం వంటివి ఉండబోవని సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె అన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని చెప్పారు.

స్కూళ్లకు, కాలేజీల‌కు సెల‌వులు ఇవ్వం..ఎందుకంటే..?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి త‌ర్వాత ప్రారంభిస్తామ‌న్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Published date : 23 Jan 2022 04:37PM

Photo Stories