Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్
Corona Virus: వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో... రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను జనవరి 26వ తేదీ వరకు మూసివేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి వైద్య, పోలీసు అధికారులతో జనవరి 8న వర్చువల్ విధానం ద్వారా జరిగిన సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని పాఠశాలలు, కళాశాలలను జనవరి 26 వరకు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్‌లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. దేశంలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి.
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్