Skip to main content

Food Safety in Schools: ఇక ఫొటోలు తీసి.. వీరు తిన్నాకే.. పిల్లలకు వడ్డించాలి!

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది.
tg govt form food safety committees amid food poison incidents

పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీలలో.. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం ఫుడ్‌ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతకుమారి న‌వంబ‌ర్‌ 28న ఉత్తర్వులు జారీ చేశారు.

సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ పై ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ త్రీమెన్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్‌, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఉండనున్నారు.

చదవండి: Mid Day Meals: సార్‌.. ఈ అన్నం మాకొద్దు.. ప్రజావాణికి ఫిర్యాదు

ఈ కమిటీలు తమ పరిధిల్లోని గురుకులాలు, వెల్ఫేర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను పరిశీలిస్తారు. అలాగే.. విద్యా సంస్థల స్థాయిలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్‌ సేఫ్టీ  పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ కమిటీలో హెడ్‌మాస్టర్‌, స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది (టీచర్లు) సభ్యులుగా ఉంటారు. వీరు వంటకు ముందు స్టోర్‌ రూం, కిచెన్‌  పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే. ఎప్పటికప్పుడు వండిన పదార్థాలను ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి.

వండిన ఆ పదార్థాలను వాళ్లు రుచి చూశాకే.. పిల్లలకు వడ్డించాలి. ఇకనుంచి.. పాఠశాలల్లో ఫుడ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులు కచ్చితంగా సూపర్‌ వైజ్‌ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Published date : 29 Nov 2024 02:10PM

Photo Stories