Good News For Anganwadi Teachers : అంగన్వాడీలకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై వీరికి..
సాక్షి ఎడ్యుకేషన్ : ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత పూర్తి వివరాలను ఏప్రిల్ 30వ తేదీ (మంగళవారం) వరకు పంపించాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ సోమవారం కీలక ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది.
వీరికి మరో గుడ్‌న్యూస్..
ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.
పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
Tags
- Anganwadi Increase in retirement age news
- Good News for Anganwadis
- retirement age news
- Trending Anganwadi news
- latest Anganwadi news
- Age limit relaxation
- Anganwadi Jobs in andhra pradesh
- Anganwadi Recruitment 2024
- Telugu News
- AP Latest Jobs News 2024
- ap anganwadi jobs news in telugu
- Latest Telugu News
- Breaking news