Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?
కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి జనవరి 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని 16వ తేదీ వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
సెలవులు కూడా..
ఇక తెలంగాణలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం..
రాష్ట్రంలో కరోనా ఆంక్షలను జనవరి 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. జనవరి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 30వ తేదీ వరకు పొడిగించారు. ఎక్కువ రోజులు సెలవులు పొడిగిస్తే మాత్రం సర్కారు స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అటు ప్రత్యక్ష తరగతులు, ఇటు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించలేదన్న విమర్శలు వస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇక అంధ్రప్రదేశ్‌లో అయితే..
ఇంటర్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. అలాగే జనవరి 17వ తేదీన కాలేజీలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలకు కూడా సంక్రాంతి సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం జనవరి 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. అయితే ఏపీలో కూడా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది కనుక ఏపీ ప్రభుత్వ ఎలాంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Telangana: జనవరి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..