Skip to main content

Gurukula School Jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Gurukula School Teacher Jobs  Application form for teaching position  Tatipudi AP Girls Gurukula School
Gurukula School Teacher Jobs

విజయనగరం అర్బన్‌: జిల్లాలోని తాటిపూడి ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో గెస్ట్‌ టీచర్‌ (పీజీటీ)గా పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ జేఎస్‌ సంధ్యాభార్గవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంగ్లిష్‌, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్ట్‌ల్లో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ, బీఎడ్‌ విద్యార్హత కలిగి బోధనలో అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 19వ తేదీలోగా తాటిపూడిలోని గురుకుల పాఠశాలలో స్వయంగా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 87126 25024 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Published date : 18 Jun 2024 08:28AM

Photo Stories