Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ మేరకు జనవరి 29వ తేదీన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కారణం ఇదే..?
యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ..
కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు కాలేజీలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ స్కూళ్లు తెరుస్తామని చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది.
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు..
ఈనేపథ్యంలోనే జనవరి 30తో సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో.. విద్యా సంస్థల రీ ఓపెన్‌కే ప్రభుత్వం సమాయాత్తమైంది. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని, విద్యాసంస్థలు తెరవాలని తల్లిదండ్రులు కూడా కోరడం కూడా రీ ఓపెన్‌కే టీ సర్కార్ మొగ్గుచూపింది.
Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!
ఏపీలో సెలవులపై తగ్గెదేలే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందన్నారు. పిల్లలకు కరోనా సోకితే ఆ స్కూల్‌ను మాత్రమే మూసివేసి తర్వాత ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.
Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్లకు మాత్రం సెలవులే..
ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్, కాలేజీలు మూసివేత...
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఈ సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లో విద్యా సంస్థలను తెరవవద్దని అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆన్‌లైన్ తరగతులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. గతంలో పెరిగిన కరోనా కేసుల మధ్య, జనవరి 30వ తేదీ నాటికి ఉత్తరప్రదేశ్‌లోని విద్యా సంస్థలను మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెల్సిందే. అంతకుముందు జనవరి 23వ తేదీ వరకు మాత్రమే పాఠశాలలు కళాశాలను మూసివేయాలని ప్రభుత్వం భావించింది.
పరీక్షలు వాయిదా..
అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేసింది. యూనివర్సిటీ-కాలేజీ సెమిస్టర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడగా.. జనవరి 16వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది.
Telangana: స్కూల్స్ సెలవులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో కష్టమే..?
విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవకాశం..ఎందుకంటే..?
Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు
Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?
Holidays: జూనియర్ కాలేజీలకు సెలవులు
Omicron Effect: రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు..కారణం ఇదే..