TSAT: 50 వేల ప్రశ్నలతో ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన
దాదాపు 50 వేల ప్రశ్నలతో రూపొందిస్తున్న ఈ క్వశ్చన్ బ్యాంక్... గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆన్ లైన్ లో నమూనా పరీక్ష (మాక్ టెస్ట్)లకు సైతం హాజరయ్యే వీలును టీశాట్ కల్పిస్తోంది. ప్రస్తుతం ఇది తయారీ దశలో ఉండగా వచ్చే నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీశాట్ వర్గాలు చెబుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్దేశించిన సిలబస్ ఆధారంగానే టీశాట్ క్వశ్చన్ బ్యాంక్ తయారవుతోంది. జనరల్ స్టడీస్, హిస్టరీ, ఎకానమీ, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్ జనరల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ఈ ప్రశ్నల నిధిని రూపొందిస్తున్నారు. టీశాట్ మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చే క్వశ్చన్ బ్యాంక్ కోసం నిరుద్యోగ అభ్యర్థులు టీశాట్ మొబైల్, వెబ్ అప్లికేషన్లలో ఫోన్ నంబర్ లేదా ఈ–మెయిల్ అకౌంట్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ అభ్యర్థులు మాత్ర మే ఈ బ్యాంకును తెరిచి మ్యాక్ టెస్ట్ ద్వారా వినియోగించుకొనే వీలుంటుంది.
చదవండి:
Department of Education: డిజిటల్ తరగతులు ప్రారంభం
Intermediate: టీ–శాట్ ద్వారా ఇంటర్ సిలబస్.. షెడ్యూల్డ్ ఇలా...
విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించడమే లక్ష్యంగా.. టి.సాట్-ఏయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం
మాక్ టెస్టులు.. ఈ–మెయిల్‌కు మార్కులు
టీశాట్ మొబైల్, వెబ్ అప్లికేషన్ ద్వారా మ్యాక్ టెస్ట్‌ను టీఎస్‌పీఎస్సీ ఇతర నియామక సంస్థలు నిర్వహించే విధంగా నిర్వహించనున్నారు. ప్రతి సెషన్ కు టీశాట్ క్వశ్చన్ బ్యాంక్‌లోంచి నిరీ్ణత సంఖ్యలో ప్రశ్నలు విడుదల చేస్తారు. వాటికి అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ ముగిశాక అభ్యర్థి ఈ–మెయిల్ ఐడీకి మార్కుల జాబితాను పంపిస్తారు. మాక్ టెస్ట్‌లతో సంబంధిత సబ్జెక్టుల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేసుకొనే అవకాశం ఉంటుందని టీశాట్ సీఈవో శైలే‹Ùరెడ్డి తెలిపారు.