NCERT: స్కాలర్‌షిప్ అర్హత పరీక్షపై అవగాహన
ఆగస్టు 29న T–SAT విద్య చానల్‌లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమవుతుందని పేర్కొన్నారు. NCERT అందించే ఈ ఉపకారవేతనాలకు తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. 2022 విద్యాసంవత్సరానికి నవంబర్‌లో జరిగే పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. దీనిలో తెలంగాణ విద్యాశాఖ పరిధిలోని NCERT, SIET భాగస్వాములవుతున్నాయని తెలిపారు. పోటీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున నాలుగేళ్లు రూ.48 వేలు అందించనుందని తెలిపారు. T–SAT అందించే లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి ఫోన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమానాలను నివృత్తి చేసుకుని అధికసంఖ్యలో అర్హత సాధించాలని సూచించారు. గతేడాది 2,921 మంది తెలంగాణ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పించినా, పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అదేరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు నిపుణ చానల్‌లో పునఃప్రసారం అవుతుందని శైలేశ్‌రెడ్డి తెలిపారు. లైవ్‌లో పాల్గొనాలనుకునేవారు 040 2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039కు కాల్ చేయాలని, టీ–శాట్ సోషల్ మీడియాలోనూ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని తెలిపారు.
చదవండి: