TSAT: టీశాట్‌లో గ్రూప్–1 వీడియో పాఠాలు
ఏప్రిల్ 25 నుంచి ప్రత్యక్ష ప్రసారా లు అందిస్తుండగా అభ్యర్థుల సులభతర శిక్షణ కోసం వీడియో పాఠాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు టీశాట్ సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి మే 9న ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణ చానల్‌లో రాత్రి 7 గం. నుంచి 8 గం. వరకు, విద్య చానల్‌లో ఉదయం 7 గం. నుంచి 8 గం. వరకు ఈ ప్రసారాలు ఉంటాయన్నారు. అభ్యర్థుల కోసం అనుభవంగల సిబ్బంది ద్వారా వర్తమాన అంశాలు, భారత చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఆంగ్లం తదితర సబ్జెక్టుల్లో సుమారు 1,000 ఎపిసోడ్లను ప్రసారం చేయనున్నట్లు శైలేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న నిర్వహించే ఉపాధ్యా య అర్హత పరీక్ష (టెట్) కోసం పోటీ పడే అభ్యర్థుల కోసం మరో గంటపాటు ప్రసారాలను పొడిగిస్తు న్నామని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తుండగా మరో అరగంట అదనంగా అందించడంతోపాటు ఉర్దూ పాఠ్యాంశాలను అరగంట అందిస్తున్నామని చెప్పారు.
చదవండి:
TSAT: టి–శాట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అవగాహన
TSAT: 50 వేల ప్రశ్నలతో ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన
Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
TSPSC Group1 Guidance: విజేతగా నిలవాలంటే.. 60 రోజుల ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి!!
క్విజ్, మాక్ టెస్టులు...
రాష్ట్రంలో పోటీ పరీక్షలకు అభ్యర్థులను అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా క్విజ్ ఎపిసోడ్లను ప్రసారం చేయడంతోపాటు ఆన్ లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నట్లు టీశాట్ సీఈఓ శైలేష్‌రెడ్డి తెలిపారు.